ఈ జన్మంత .... నీ వెంటే ఉండాలనీ.....
నీ చెంతనే నడవాలని......
నీ ఊపిరిగా .....
బ్రతకాలని కన్న నా కలలు....
ఊపిరి లేని జీవంలా.....
స్పందన లేని హ్రుదయంలా....
దారం తెగిన.... గాలి పటంలా ....ఉండగా...
దిశ తెలియని నావికుడిలా....
ప్రేమ అనే మహా సముద్రంలో...
నమ్మకం అనే ఒక చిన్న...పడవ లో...
ఎప్పుడూ ఉన్నట్టుగానే అనిపించే....
కానీ కనిపించని ధ్రువ తారలాంటి...
నీ హ్రుదయం కోసం....
నా హ్రుదయంలోని ....
నీ మీద ప్రేమ...
వెలుగులా... దారి చూపుతుంటే....
నీ హ్రుదయం అనే ఆ సుందర దీవిని చేరుకోవాలనీ...
ఈ జీవి పడే ఆవేదనే ....
నా ఈ మనసు కథ.....
-----ఇట్లు నీ కోసం నీరీక్స్హించే....
నీ జీవి....
సుబ్రహ్మణ్యం
అంకితం : ప్రేమించే ప్రతి జీవికీ.....
............................ ప్రేమికుల రోజు శుభాకాంక్స్హ్లలు...............
copied from my facebook note dated back to 13 feb 2011
No comments:
Post a Comment