నేనెందుకు నీకు శుభ రాత్రి చెప్తున్నా అంటే ...

వెన్నెలమ్మ దీపాలు ఆపమన్నది ...
మా అమ్మ గారు ఫొను నన్ను ఆపమన్నారు ..

అందువల్ల ...

గుండెల్లొ నిన్ను దాచుకున్నా ...
దిండుల్లొ నా ఫొను దాచుకున్నా ...
నీ పిలుపు కొరకు చెవులు ...
సందేసం కోసం కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి ...

విరిసిన మల్లెలు నీరుగారి వాలుతున్నాయి ...
సాయంత్రపు పిల్ల గాలి చల్లగాలి గా మారింది ..
సంధ్యాకాలపు చీకటి .. చిమ్మ చీకటి గా మారింది ..
నీ వాట్సప్ స్టేటస్ కూడ మారింది..

కానీ నీ చూపు నా వైపుకు మరల లేదు ...

ఎన్నో రాత్రులు వస్తాయి కానీ వెన్నెలమ్మ ప్రతీ రోజు  రాదు ..
ఆ వెన్నెలమ్మ వచ్చినా ..
పున్నమి వెన్నెల కూడా తెచ్చినా...
ఈ వెన్నెలమ్మ రాలేదు .. ఇక రాదు ..ఈ రేయికి..

అందుకె ఈ సందేసం ...

వెన్నెల రావచ్చు రాకపోవచ్చు ..
కాని ఆ వెన్నెలను ప్రేమించే చుక్కలు ... ఎప్పుడూ వస్తాయి ..
నేను ఆకాశంలో ఆ చుక్కల్లా నీ రాక కోసం ..
ఎదురు చూస్తూ ..
నీ రాత్రి ప్రయాణం సుఖంగా, సౌఖ్యంగా, సురక్షితంగా జరగాలని కోరుకుంటూ   ...

శుభ రాత్రి ....


వెన్నెలమ్మ కోసం దీపాన్ని ...
మా అమ్మ గారి కోసం ఫొను ని ...
నా కోసం ఈ వై-ఫై ని ఆపేసి ... పడుకుంటున్నా...

ఫ్రియతమా ... మరొక్కమారు ...  శుభ రాత్రి ..    



No comments:

Post a Comment